Electric shock: కరెంట్ షాక్ తో మహిళ మృ*తి భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మరుసటి రోజే.

Electric shock. బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తో మహిళ మృ*తి చెందిన ఘటన విషాదం చోటు చేసుకుంది. మండలంలోని రాజారాం గ్రామానికి చెందిన శీలం మానస (30) బుధవారం ఉదయం ఉతికిన బట్టలు ఇంటి ముందున్న తీగపై ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో కిందపడిపోయింది. రెక్క ఆడితే డొక్కాడని నిరుపేద కుటుంబం కాగా మృతురాలి భర్త శీలం సంతోష్ మంగళవారం ఉపాధి నిమిత్తం బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లాడు. భార్య మృ*తిని తట్టుకోలేక శుక్రవారం స్వగ్రామానికి చేరుకోనున్నాడు. వారికి కొడుకు, కూతురు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుత్ ఘాతానికి గురైన మానసను కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని తెలిపారు. మృతురాలి ఇంట్లో డిష్ కి సంబంధించిన బాక్స్ ద్వారా కరెంట్ ప్రసారం అవుతుందని గత మూడు నెలలుగా డిష్ యజమానికి చెప్పిన నిర్లక్ష్యం వహించాడని, డిష్ వైర్ కేబుల్ బట్టలు ఆరేసే ఇనుపతీగపై పడి ఉండడంతో షాక్ కొట్టినట్టు బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. యజమాని ఇంటి ముందు మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల పోలీసులు చేరుకొని ఇరువర్గాల సర్ది చెప్పి సముదాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp Group Join Now

electric shock woman died from electric shock

Read Also: kondagattu Anjaneya: కొండగట్టు ప్రసాద కౌంటర్ల వద్దఅవ్యవస్థ – భక్తుల్లో అసహనం!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →