
TELANGANA PATRIKA (MAY18) , సిద్దిపేట జిల్లా , రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి. శ్రీసుధాను రంగనాయక సాగర్ అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆదివారం హైకోర్టు జడ్జితో కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
శనివారం సరస్వతి నది పుష్కరాలకు కాళేశ్వరం వెళ్ళిన న్యాయమూర్తి ముగించుకుని తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి కొరకు రంగనాయక సాగర్ అతిధి గృహంకి విచ్చేశారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో న్యాయ విషయాల గూర్చి కాసేపు ముచ్చటించారు. జిల్లాకు విచ్చేసిన జడ్జిని శాలువాతో సన్మానించి చేర్యాల పెయింటింగ్ బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, ఆర్డీవో సదానందం, ఏసిపి మధు, న్యాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : Ponguleti Srinivasa Reddy: పెన్షన్ ఆలస్యం పై స్పందించండి – మంత్రికి విజ్ఞప్తి పత్రం!
Comments are closed.