
TELANGANA PATRIKA (MAY16) , Drug awareness for youth: వైరా ఎస్సై పి రామారావు ,యువత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు అలవటు పడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వైరా ఎస్సై వి రామారావు యువతకు సూచించారు గురువారం ఎస్సై రామారావు మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యులలో లేదా బందువులలో , స్నేహితులలో ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు అయినట్లయితే అలాంటి వారి వివరాలను పోలీసులకు అందించాలని ఆయన సూచించారు. గంజాయి పెంఛిన, ఇతర నిషేధితమత్తు పదార్థాలు పెంచిన, , రవాణా చేసిన అలాంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని సూచించారు. మత్తు పదార్థాల బారిన పడుతున్న యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ, తాము మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా క్షోభకు గురిచేస్తున్నారని తెలిపారు గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని, గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మల కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .అదేవిధంగా తెలియని వ్యక్తులు మీకు ఏమైనా పట్టుకోమని ఇస్తే వాటిని పట్టుకోవద్దని ఎస్సే రామారావు సూచించారు
Also Read : Anti Drug Awareness Campaign Telangana: మత్తు పదార్థాల నివారణపై పోలీసుల హెచ్చరిక
Comments are closed.