
TELANGANA PATRIKA (MAY 16) , Ponnam Prabhakar: వేములవాడ అర్బన్ రెవెన్యూ మండల కార్యాలయం నుండి సివిల్ సప్లయ్, వరి ధాన్యం కొనుగోలు పై మంత్రులు , సిఎస్ ,జిల్లాల కలెక్టర్లు ,ఇతర అధికారులతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కి సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు ,దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తుంది
సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఎస్ అన్ని జిల్లాల కలెక్టర్ లతో విడియో కాన్ఫరెన్స్ జరిగిందిరుద్రంగి లో ఉండడం వల్ల వేములవాడ నుండి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది.అధిక తూకం లేకుండా,ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండం చర్యలు తీసుకోవడం తో పాటు పేమెంట్ ఆలస్యం లేకుండా వెంటవెంటనే పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది
రైతులకు ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ కి పిర్యాదు చేయండి.రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు.
ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.పంట ఎండిపోయింది అనే అవకాశం లేకుండా విద్యుత్ ఇబ్బందులు లేకుండా ,నీటిని వాడుకుంటూ పంటలు కాపాడుకున్నాం.
Also Read : Ration news Telangana : మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ..!
Comments are closed.