Telangana Inter supplementary exam : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు

TELANGANA PATRIKA (MAY 15) , Telangana Inter supplementary exam 2025 schedule ప్రకారం, మే 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఇంటర్ విద్యాధికారి శ్రీ రవికుమార్, పోలీసు, విద్యుత్, రవాణా, ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

Telangana Inter supplementary exam పరీక్షల సమయాలు & హాజరయ్యే విద్యార్థులు

  • మొదటి సంవత్సరం పరీక్షలు: ఉదయం 9:00 నుంచి 12:00
  • రెండవ సంవత్సరం పరీక్షలు: మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30
  • మొత్తం విద్యార్థులు: 18,837
  • పరీక్షా కేంద్రాలు: 36

సౌకర్యాలు & భద్రతా ఏర్పాట్లు అదనపు కలెక్టర్ సూచనలు:

  1. ఆర్టీసీ ద్వారా బస్ సౌకర్యం
  2. నిరంతర విద్యుత్ సరఫరా
  3. పోలీస్ బందోబస్తు
  4. ప్రశ్నాపత్రాల భద్రతైన రవాణా
  5. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు
  6. హెల్త్ క్యాంప్‌లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు
  7. 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత

పర్యవేక్షణ & స్క్వాడ్

  • 6 సిట్టింగ్ స్క్వాడ్లు
  • 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు
  • అన్ని పరీక్ష కేంద్రాల్లో CCTV పర్యవేక్షణ
  • ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందుబాటులో

ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ, పరీక్షలు నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరగేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Also Read : Minority residential schools admission Telangana 2025: మైనారిటీ విద్యార్థులకు ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *