T-jeevan reddy: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, అదనంగా మహిళలకు ఉచిత రవాణా, గృహాలకు 200వరకు ఉచిత యూనిట్ల విద్యుత్, సిలిండర్ 500 లకే, సన్న రకాలకు 500 బోనస్ అందిస్తోంది.ఏ రాజకీయ పార్టీ కూడా రుణ మాఫీ గురించి ప్రస్తావించడం లేదు. కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 21 వేల కోట్ల తో రుణ మాఫీ చేసినం.రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నాం.ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో కల్లం కాడ వడ్లు తూకం వేయడం తెరపైకి తీసుకు వచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఈ ఏడాది 45 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. గతేడాది కేవలం 30 లక్షల ధాన్యం సేకరణ చేశారు. జగిత్యాల జిల్లా లో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం. ధాన్యం సేకరణలో రైతులకు అండగా నిలుస్తూ ధాన్యం డబ్బులు 48 గంటల్లో చెల్లిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పారదర్శకంగా అర్హతకు అనుగుణంగా అందరికీ రేషన్ కార్డు ఇస్తారని ఎవరు కూడా ఊహించి ఉండరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 55 లక్షల రేషన్ కార్డులకే అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తెల్ల రేషన్ కార్డు కు ప్రాధాన్యత పెరిగింది.ప్రభుత్వం అమలు చేసే స్వయం ఉపాధి పధకాల అమలుకు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కొలబద్ద కానుంది. అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ప్రజా పాలనలో దరఖాస్తుచేసుకున్న ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న జారీ చేస్తున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ గా కొనసాగింది. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో రేషన్ కార్డు రాని వారు మా దృష్టికి తీసుకు రావాలని సూచించారు.రేషన్ కార్డు తో నిత్యాసర వస్తువులు అందించనున్నాం.

విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి T-jeevan reddy వ్యాఖ్యలు.
జగిత్యాల లో మామిడి మార్కెట్ కోసం 25 ఎకరాలు కేటాయించి, ఏర్పాటు చేసినం.స్థానిక రైతులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా మామిడి మార్కెట్, రైతులకు, కూలీల కోసం ఏర్పాటు చేసినం. మామిడి మార్కెట్ లో వేలం నిర్వహిస్తే మామిడి రైతులకు మేలు జరుగుతుంది అని కలెక్టర్ కు విన్నవిస్తే కలెక్టర్ మామిడి మార్కెట్ సందర్శించి, ఆదేశాలు జారీ చేశారు.మార్కెట్ లో కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో వేలం నిర్వహించాల్సి ఉన్నా, మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లప్తత తో రైతులు నష్టపోతున్నారు.మార్కెటింగ్ ఫీజు 4 ఉంటే, 10 రూపాయలు వసులు చేస్తున్నారు. ఇదేమిటని అధికారులను అడిగితే మా దగ్గరికి ఎవరు రావడం లేదు అంటున్నారు.మామిడి లో నాణ్యత ప్రమాణాల కోసం గ్రేడింగ్ పేరిట మరో 10 శాతం వసూలు చేస్తున్నారు.మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించాల్సిన వేలం ట్రేడర్లు వారి దుకాణాల ఎదుట వేలం నిర్వహిఅంటున్నారు.
జిల్లా కలెక్టర్ మామిడి మార్కెట్ను సందర్శించిన తర్వాత కూడా మార్కెట్ లో అవకతవకలు అరికట్టకపోతే ఎలా.మామిడి మార్కెట్ లో అవకతవకలు అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేయాలి.మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో కామన్ ప్లేస్ లో వేలం నిర్వహించాలి.సీఎం రేవంత్ రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నారు. అధికారులు నిత్యం సమీక్షలు చేస్తున్న మార్కెటింగ్ శాఖలో చలనం లేకపోవడం దురదృష్టకరం. మామిడి మార్కెట్ లో అవకతవకలకు జిల్లా మార్కెట్ శాఖ అధికారి, మార్కెట్ శాఖ కార్యదర్శి బాధ్యులు మామిడి మార్కెట్ ను పర్యవేకించేలా ఆర్డీఓ కు బాధ్యతలు అప్పగించాలి. మామిడి రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలి కమిషన్ 4 శాతానికి మించకూడదు.సూట్ 5 శాతం కు మించకూడదు.తక్ పట్టి వెంటనే జారి చేయాలి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.
Read More: Telangana revenue minister visit arrangements: కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను సమీక్షించారు