Advertisement

Joint Command Officer: ఝాన్సీ కంటోన్మెంట్ ఆర్మీ జాయింట్ కమాండ్ ఆఫీసర్ గా ప్రమోట్ అయిన మెట్పల్లి వాసి!

Joint Command Officer: మెటుపల్లి పట్టణానికి చెందిన ఆకుల లక్ష్మీ-నర్సయ్య దంపతుల పెద్ద కుమారుడు అయిన ఆకుల ఆనంద్ 2005 వ సంవత్సరంలో ఆర్మీలో చేరి గత 20 సంవత్సరాలలో అంబలా, ఢిల్లీ,జమ్మూకాశ్మీర్, ఝాన్సీ, హర్యానా, చండీగఢ్, లేహ్, లద్ధాక్, ఝాన్సీలో వివిధ హోదాలలో పనిచేసి ఈరోజు ఝాన్సీ ఆర్మీ కంటోన్మెంట్ జూనియర్ కమాండ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు కుటుంబసభ్యులు ఎంతో సంతోపడ్డారు. అంతేగాక మన ప్రాంత వాసి ఆర్మీలో ఉన్నత స్థానం పొందటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కష్టపడి ఈ స్థాయికి రావడం ఎంతో గొప్ప విషయమని ఇలాంటి వారిని చూసి స్థానిక యువకులు ఆదర్శంగా తీసుకుని దేశసేవకు ముందుకు రావాలని పలువురు పిలుపునిచ్చారు. Joint Command Officer ఇక వీరి కుటుంబ విషయానికి వస్తే తల్లిదండ్రులు ఆకుల లక్ష్మీ-నర్సయ్య మామూలు రైతులు నిరాక్షరాస్యులు అయినప్పటికీ వారి సంతానాన్ని ఎంతో కష్టపడి చదివించారు.వీరి కూతురు ఆకుల మంజుల గవర్నమెంట్ టీచర్ గా, పెద్ద కుమారుడు ఆనంద్ ఆర్మీ ఆఫీసర్,చిన్న కుమారుడు ఆకుల ప్రవీణ్ అడ్వకేట్ పనిచేస్తున్నారు.కష్టపడి పిల్లలను ఈ స్థాయికి తీసుకువచ్చిన వారి తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

Advertisement
Joint Command Officer from Metpally telangana

Read More: Telangana revenue minister visit arrangements: కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను సమీక్షించారు

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →