TELANGANA PATRIKA (MAY 11) , TS EAPCET 2025 Rank Achievers: ఇటీవలి విడుదలైన TS EAPCET 2025 ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నారు.

కాకతీయ విద్యాసంస్థల చైర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఈ విద్యార్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్ లేకుండా, ఇంటర్ పూర్తి చేసిన వెంటనే డైరెక్ట్‌గా ఎప్సెట్ రాసి మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో దిగువ విద్యార్థులు ర్యాంకులు సాధించారు:
TS EAPCET 2025 Rank Achievers ర్యాంకులు సాధించిన విద్యార్థులు:
- అనాస్ అలీ – 1766
- ఎం. సంకేత్ – 2398
- జి. వేదాక్షర్ – 2881
- భవ్య శ్రీ – 3310
- యం. లోకేష్ – 3671
- ఎ. వైష్ణవి – 4172
- జి. రిషీక్ – 5932
- వి. నికేతన్ – 6293
ఈ సందర్భంగా వారిని కళాశాల డైరెక్టర్లు సందీప్, రణదిష్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్ శ్యాం తదితరులు అభినందించారు. విద్యార్థుల విజయాన్ని తలచుకుంటూ, వారి నిరంతర అభ్యాసం, నమ్మకం వారికి విజయాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
విద్యార్థులకు సూచన:
ఈ ఫలితాలు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చునన్న ఉదాహరణగా నిలుస్తున్నాయి. TS EAPCET పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ప్రేరణగా ఉండనుంది.
Read More: Read Today’s E-paper News in Telugu