Advertisement

Vemulawada 2025: అభివృద్ధి పేరిట రాజన్న ఆలయం మూసేస్తే ఊరుకోం!

Vemulawada 2025: దేవస్థానం అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్.వేములవాడ పట్టణంలో బిజెపి టౌన్ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో వేములవాడ పట్టణ మరియు దేవస్థాన అభివృద్ధికి వ్యతిరేకం కాదని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఉద్యమాల కమిటీకి రాజన్న రక్షణ సమితి అని పేరు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరైనాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15 వ తేదీ నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి భాగంగా రాజన్న ప్రధాన ఆలయాన్ని మూసివేస్తున్నట్లు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Vemulawada 2025

Vemulawada 2025: రాజన్న భక్తులకు పూజలు కోడే మొక్కులు దైవదర్శనాలు అన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఇట్టి విషయాన్ని రాజన్న రక్షణ సమితి పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. రాజన్న భక్తులకు యధావిధిగా రాజన్న ప్రధాన ఆలయంలో దర్శనాలు కల్పించాలని మరోవైపు ఆలయ అభివృద్ధిని కొనసాగించాలని రాజన్న రక్షణ సమితి రాజన్న అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది అని. భక్తుల దర్శనాలు నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రతాప్ రామకృష్ణ పేర్కొన్నారు. వారణాసిలో గాని జోగులాంబ గాని దేవతమూర్తులను ముట్టకుండా దేవాలయాలను అభివృద్ధి చేయడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో కూడా అదేవిధంగా దేవత మూర్తులను ముట్టుకోకుండా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయంలో లోపల ఉన్న దర్గాను తొలగించి గుడి చెరువు ప్రాంతంలో ప్రత్యేక స్థానంలో నెలకొల్పాలని రాజన్న రక్షణ సమితి నిర్ణయించింది. వీటిని అన్నిటికి నిరాశనగ మే 14, బుధవారం రోజున రాజన్న రక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం పూర్తి బంద్ కు పులుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్, సంటి అంజిబాబు, గోపు బాలరాజు, మహంకాళి శ్రీనివాస్, బుజ్జి వంశీకృష్ణ, బిజెపి శ్రేణులు, కార్యకర్తలు వర్తక వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Read Also: Sircilla Collector: జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో విన్నపం – వారంలోనే సాయం!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.