LIC pension scheme ఒకసారి పెట్టుబడి, జీవితాంతం ఆదాయం భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం మంచి రిటైర్మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అప్పుడు LIC యొక్క New Jeevan Shanti Plan మీకు సరైన ఎంపిక. ఇది ఒక సింగిల్ ప్రీమియం ప్లాన్, అంటే ఒక్కసారిగా పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ పొందొచ్చు.
ముఖ్యమైన విషయాలు:
- వయస్సు పరిమితి: 30 నుండి 79 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఇన్వెస్ట్‌మెంట్ ఎంపికలు: సింగిల్ లేదా జాయింట్ లైఫ్ ఎంపికలలో ఏదైనా ఎంచుకోవచ్చు.
- పెన్షన్ స్టార్ట్: మీరు ఎంచుకున్న డిఫర్డ్ వ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది.
ఉదాహరణ: 55 ఏళ్ల వ్యక్తి ₹11 లక్షలు పెట్టుబడి పెడితే, సంవత్సరానికి ₹1,01,880 పెన్షన్ లభిస్తుంది. నెలవారీగా అయితే ₹8,149 ఉంటుంది.
ప్రత్యేకతలు:
నివేశం సురక్షితం – LIC ప్రభుత్వ కంపెనీ కావడంతో నమ్మకంగా ఉంటుంది.
సరెండర్ సౌలభ్యం – అవసరమైతే ప్లాన్‌ను మధ్యలోనే విరమించవచ్చు.
నామినీకి రివర్స్ బెనిఫిట్ – పాలసీదారుడి మృతి చెందిన సందర్భంలో మొత్తం డిపాజిట్ నామినీకి లభిస్తుంది.

Also Read: Food Safety Task Force Raids: బెల్ స్వీట్స్ కారా తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు
Comments are closed.