Telanganapatrika (May 3): JBS Medchal Metro. హైదరాబాద్ మెట్రో రెండో దశలో వేగవంతమైన ప్రగతి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ ‘బి’లో భాగంగా మూడు కీలక మార్గాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) పూర్తైంది.
JBS Medchal Metro ఈ మార్గాలు:
జేబీఎస్ నుండి మేడ్చల్ – 24 కిలోమీటర్లు
జేబీఎస్ నుండి శామీర్‌పేట – 21 కిలోమీటర్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ – 40 కిలోమీటర్లు.

ప్రపంచ స్థాయి మెట్రో హబ్ @ జేబీఎస్
ఈ ప్రాజెక్టులో భాగంగా జేబీఎస్ వద్ద ప్రపంచ స్థాయి మెట్రో హబ్‌ను నిర్మించనున్నట్టు ప్రతిపాదన ఉంది. దీని రూపకల్పనకు జపాన్‌లోని రవాణా మోడల్స్‌ను ఆధారంగా తీసుకుంటున్నారు.
ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం
హైదరాబాద్ మెట్రో రెండో దశలో నగర ఉత్తర భాగాలను మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానించడమే లక్ష్యం. మార్గాల పొడవు, స్టేషన్ల అభివృద్ధి, భూసేకరణ తదితర అంశాలపై ఇప్పటికే ప్రాథమిక అధ్యయనం పూర్తయ్యింది
Also Read: TSRJC CET Hall ticket 2025: హాల్‌టికెట్లు విడుదల – ఇప్పుడే tgrjc.cgg.gov.in నుండి డౌన్‌లోడ్ చేయండి!