
బిర్యానీ గణేశ్ ప్లెక్సీ అరెస్ట్: తమిళనాడులోని తిరునెల్వేలిలో వినాయక చవితి వేడుకల సందర్భంగా ఓ బిర్యానీ దుకాణం ముందు పెట్టిన ప్లెక్సీ కలకలం రేపింది. వినాయకుడు బిర్యానీ తింటున్నట్లు లేదా వండుతున్నట్లు చూపించిన బ్యానర్‌పై మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు రావడంతో దుకాణ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది?
తిరునెల్వేలి–తిరుచెందూర్ ప్రధాన రోడ్డు పైన వి.ఎం. చత్రం సమీపంలో ఉన్న బిర్యానీ దుకాణం యజమాని జయంత్ (30) వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. అరబిక్ స్టైల్ చికెన్ 65 బిర్యానీని ₹99కే అందిస్తున్నట్లు బ్యానర్ పెట్టారు. అయితే ఆ బ్యానర్‌లో వినాయకుడు బిర్యానీ వండుతున్నట్లు లేదా తింటున్నట్లు చిత్రీకరించారు.
ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. నరసింగనల్లూర్‌కు చెందిన సెల్వరాజ్ (42) పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుడైన వినాయకుడిని ఈ విధంగా చిత్రించడం భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు.
బిర్యానీ గణేశ్ ప్లెక్సీ అరెస్ట్ – పోలీసుల చర్య
పోలీసులు ముందుగా షాప్‌కు వెళ్లి బ్యానర్‌ను తొలగించారు. ఆ తర్వాత విచారణ జరిపి ఆదివారం జయంత్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తూ విచారణ కొనసాగుతోంది.
వినాయక చవితి సందర్భంగా తమిళనాడు అంతటా వేడుకలు ఘనంగా జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. చెన్నై, మధురై, తిరుచిరాపల్లి వంటి ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
పోలీసులు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu

