Sircilla: సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెంగళ వెంకటేశం మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిష్పక్షపాత విచారణకు డిమాండ్ చేశారు. బుధవారం వెంకటేశం కుటుంబాన్ని కలిసి ఆయన భార్య, తల్లి, కుమార్తెను పరామర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వెంకటేశం మృతికి అసలు కారణాలు బయటకు రావాలని, బాధ్యులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Sircilla పోలీసుల దర్యాప్తుపై KTR ప్రశ్నలు
ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం ఉందని కేటీఆర్ తెలిపారు. అయితే వారిలో ఇద్దరినే రిమాండ్‌కు పంపి, మరో ముగ్గురిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పోలీసులు పారదర్శకంగా విచారణ చేయాలని కోరారు. వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని అన్నారు.
కుటుంబానికి ఇల్లు నిర్మిస్తామని హామీ
Sircilla వెంకటేశం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు కోసం కుటుంబం చేసిన విజ్ఞప్తికి నెలలుగా స్పందన రాలేదని పేర్కొన్నారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇల్లు నిర్మించకపోతే బీఆర్ఎస్ తరఫున ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కూతురి చదువుల బాధ్యత KTRదే
వెంకటేశం 11 ఏళ్ల కుమార్తె ప్రస్తుతం 5వ తరగతి చదువుతోంది. ఆమె పేరుపై ₹3 లక్షలు డిపాజిట్ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
అంతేకాకుండా ఆమె భవిష్యత్ విద్యా ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున తక్షణ ఆర్థిక సాయం కూడా అందించారు.
న్యాయం జరిగే వరకు వెంకటేశం కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu

