Jio Home Packs: Reliance Jio యూజర్ల కోసం కొత్త Home Packsను తీసుకొచ్చింది. ఒకే ప్యాక్‌లో బ్రాడ్‌బ్యాండ్, లైవ్ TV, OTT యాప్స్ పొందాలనుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.

ఈ కొత్త ప్లాన్స్ ధరలు నెలకు రూ.400 నుంచి ప్రారంభమవుతాయి. యూజర్ల అవసరాలను బట్టి TV-only, Wi-Fi-only, 3-in-1 ప్యాక్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
Jio Home Packs రూ.400కే TV ప్యాక్
కొత్త Jio Home Packsలో అత్యంత చౌకైనది TV-only ప్యాక్.

దీని ధర నెలకు రూ.400.
ఈ ప్లాన్‌లో 1,000కి పైగా లైవ్ TV ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 200కి పైగా HD ఛానళ్లు ఉన్నాయి.
15కి పైగా ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను చూడొచ్చు. అంతేకాకుండా 12కి పైగా OTT యాప్స్ కూడా లభిస్తాయి.
TVలో YouTube చూసే అవకాశం, లైవ్ ప్రోగ్రామ్‌ను Play/Pause చేసే సదుపాయం కూడా ఉంటుంది.
Jio Home Packs Wi-Fi కోసం రెండు ప్లాన్స్
ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకునే వారి కోసం Jio రెండు Wi-Fi-only ఆప్షన్లను అందిస్తోంది.
30Mbps ప్లాన్:
5 నెలలకు రూ.2,200. అంటే నెలకు సుమారు రూ.440 అవుతుంది.
100Mbps ప్లాన్:
5 నెలలకు రూ.3,000. అంటే నెలకు రూ.600 అవుతుంది.
ఇదే కాకుండా తక్కువ కాలానికి సంబంధించిన ప్యాక్స్ కూడా ఉన్నాయి.
30Mbps ప్యాక్‌కు రూ.1,100 ధరగా, 100Mbps ప్యాక్‌కు రూ.1,500 ధరగా పేర్కొన్నారు.
Jio Home Packs Jio 3-in-1 Home Pack
ఈ కొత్త ఆఫర్లలో ప్రధాన ఆకర్షణ 3-in-1 Home Pack.
ఇందులో Wi-Fi, Live TV, OTT సేవలు ఒకే ప్యాక్‌లో వస్తాయి.
30Mbps 3-in-1 ప్యాక్ ధర 4 నెలలకు రూ.2,222. అంటే నెలకు సుమారు రూ.555 అవుతుంది.
ఈ ప్లాన్‌లో 1,000కి పైగా లైవ్ TV ఛానళ్లు, 12 OTT యాప్స్ అందుబాటులో ఉంటాయి.
100Mbps 3-in-1 ప్లాన్
వేగవంతమైన ఇంటర్నెట్ కావాలనుకునే వారికి 100Mbps 3-in-1 ప్యాక్ ఉంది.
ఈ ప్లాన్ ధర 3 నెలలకు రూ.2,122. అంటే నెలకు సుమారు రూ.707 అవుతుంది.
ఇందులో కూడా 1,000కి పైగా లైవ్ TV ఛానళ్లు, 12 OTT యాప్స్ లభిస్తాయి.
ఉచిత ఇన్‌స్టాలేషన్
కొత్తగా ఈ ప్లాన్స్‌కు కనెక్ట్ అయ్యే అర్హత ఉన్న కస్టమర్లకు Jio కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
వారికి ఉచిత డోర్‌స్టెప్ ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్ సపోర్ట్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Jio Home Packs ఎవరు ఏ ప్లాన్ తీసుకోవచ్చు?
కేవలం TV మాత్రమే కావాలనుకునే వారు రూ.400 TV-only ప్యాక్ తీసుకోవచ్చు.
ఇంటర్నెట్ అవసరం మాత్రమే ఉన్నవారు 30Mbps లేదా 100Mbps Wi-Fi ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు.
ఇంటర్నెట్‌తో పాటు TV, OTT అన్నీ ఒకే ప్యాక్‌లో కావాలనుకునే వారు 3-in-1 Home Pack తీసుకోవచ్చు.
మొత్తంగా చూస్తే.. బ్రాడ్‌బ్యాండ్, TV, OTT కోసం వేర్వేరు సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే ప్యాక్‌లో సేవలు పొందాలనుకునే కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని Jio ఈ కొత్త Home Packsను తీసుకొచ్చింది.
Read More: Read Today’s E-paper News in Telugu
