TG TET 2025: దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగింపు, ఎడిట్ లింక్ మిస్ అవ్వకండి!

TG TET 2025: దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది , తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TG TET) 2025 కోసం దరఖాస్తు గడువు ఎప్రిల్ 30తో ముగియనుంది. ఇప్పటివరకు పేపర్ 1 మరియు పేపర్ 2 కలిపి మొత్తం 1,13,592 దరఖాస్తులు వచ్చాయి.

Join WhatsApp Group Join Now

దరఖాస్తుల వివరాలు

  • పేపర్ 1: 32,372 దరఖాస్తులు
  • పేపర్ 2: 69,455 దరఖాస్తులు
  • రెండు పేపర్లకు: 11,765 దరఖాస్తులు

గతేడాది 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ, ఈసారి దరఖాస్తుల సంఖ్య సగం కూడా అందలేకపోయింది. అధికారులు అంటున్నారు, టెట్ పరీక్షలను ప్రతి ఆరు నెలలకోసారి నిర్వహించడమే దరఖాస్తుల తగ్గుదలకు కారణమని.

TG TET 2025 దరఖాస్తులో తప్పులు సరిదిద్దే అవకాశం – ఎడిట్ ఆప్షన్

ఏప్రిల్ 30తో దరఖాస్తు గడువు ముగియనుండగా, దరఖాస్తులో ఎటువంటి తప్పులు ఉన్నా మే 3వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిదిద్దుకోవచ్చు.

ఎడిట్ ఆప్షన్ లింక్ వివరాలు
  • తప్పుల సవరణకు మే 3 వరకు అవకాశం
  • అధికారిక వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి ఎడిట్ చేసుకోవచ్చు
  • ముఖ్యమైన డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించి సరిచేయాలి
TG TET 2025 పరీక్ష తేదీలు

జూన్ 15 నుంచి జూన్ 30 వరకు TG TET పరీక్షలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు సంబంధిత తేదీలలో అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: CBSE Result 2025 Live: త్వరలో విడుదల కానున్న సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు – పూర్తి వివరాలు ఇక్కడ!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →