Illicit Liquor Case Telangana: నాటు సారా నియంత్రణలో భాగంగా నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలను నిర్వహించగా నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఏలేటి కృష్ణ తండ్రి సారయ్య అనే వ్యక్తి నాటుసారా అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడినాడు. అతడు గతంలో తాసిల్దార్ ఎదుట బైండోవరై ఉన్నందున బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటుసారా అమ్మినందున అతడిని నర్సంపేట తహసిల్దార్ ఎదుట హాజరుపరచగా, తహసిల్దార్ రాజేష్ అతనికి 50వేల జరిమానా విధించగా అతను చలానా రూపంలో చెల్లించడం జరిగింది. ఇట్టి దాడులలో ఎస్సై శార్వాణి సిబ్బంది పాల్గొన్నారు.

Illicit Liquor Case Telangana బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నాటు సారా తయారు చేస్తూ,అమ్ముతూ పట్టుబడిన వారిని వారి ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తూ బైండోవర్ చేయడం జరుగుతుంది అయినప్పటికిని పద్ధతి మార్చుకోకుండా తిరిగి అదే నేరాలకు పాల్పడినట్లయితే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుంది అని తహసిల్దార్ రాజేష్ హెచ్చరించడం జరిగింది
ఆర్ నరేష్ రెడ్డి ఎక్సైజ్ సీఐ నర్సంపే.

Also Read: BRS 25 years celebrations: బీఆర్‌ఎస్ ఉద్యమానికి పాతికేళ్లు ఎల్కతుర్తిలో కేసీఆర్ ప్రసంగం!