TGTET 2026 Notification: తెలంగాణలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు మరియు రాష్ట్రం గుర్తించిన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల కోసం TGTET-In-service Teachers-2026 నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హులైన ఉపాధ్యాయులు జూలై 22 నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ TGTET అర్హత ఉద్యోగంలో కొనసాగడం లేదా పదోన్నతుల (Promotion) కోసం మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యక్ష నియామకాలకు (Direct Recruitment) ఈ అర్హతను ఉపయోగించలేమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
TGTET 2026 Notification ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
|---|---|
| దరఖాస్తుల ప్రారంభం | జూలై 22, 2026 |
| చివరి తేదీ | జూలై 29, 2026 |
| హాల్ టికెట్లు | ఆగస్టు 31, 2026 |
| పరీక్ష తేదీలు | సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు |
| ఫలితాలు | సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు |
పరీక్ష విధానం
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు
- పరీక్ష సమయం 150 నిమిషాలు
- నెగెటివ్ మార్కింగ్ లేదు దరఖాస్తు ఫీజు
- ₹700 నుంచి ₹1,000 వరకు (ఎంచుకున్న పేపర్ ఆధారంగా)
TGTET 2026 Notification ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
- తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లు
- స్థానిక సంస్థల (Local Body) టీచర్లు
- రాష్ట్రం గుర్తించిన నిర్దిష్ట విద్యాసంస్థల ఉపాధ్యాయులు గమనించాల్సిన విషయం
ఈ TGTET అర్హత ప్రమోషన్ లేదా ఉద్యోగంలో కొనసాగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కొత్త టీచర్ ఉద్యోగాల నియామకాలకు ఇది చెల్లదు.
Read More: Read Today’s E-paper News in Telugu
