Gram Panchayat Staff Salaries : ప్రతి నెల 1వ తేదీకే గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు

Gram Panchayat Staff Salaries: తెలంగాణలో గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన సమయానికి జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి A. Revanth Reddy అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం ప్రతి నెల రూ.50 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, “IAS అధికారులకు ఎలా సమయానికి జీతాలు వస్తాయో, గ్రామపంచాయతీ ఉద్యోగులకు కూడా అలాగే రావాలి” అని స్పష్టం చేశారు.

Advertisement

Gram Panchayat Staff Salaries ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అనే తేడా లేకుండా అన్ని శాఖల ఉద్యోగులకు నెల మొదటి తేదీకే జీతాలు చెల్లించాలని ఆదేశించారు. ఒక్కరోజు ఆలస్యాన్ని కూడా సహించబోమని హెచ్చరించారు.

ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన ఒక కీలక నిబంధనను మళ్లీ అమలు చేయాలని సీఎం అంగీకరించారు. గ్రామపంచాయతీల స్వంత ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని తిరిగి తీసుకురావాలని సూచించారు. దీంతో గ్రామపంచాయతీలకు తమ ఆదాయంపై స్వయం నియంత్రణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

అదే విధంగా సామాజిక భద్రత పెన్షన్లను ఇకపై పోస్టల్ శాఖ ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశించారు.

పెన్షన్ వ్యవస్థను ఓటర్ ఐడీ, ఆధార్, తెలంగాణ సామాజిక-ఆర్థిక-విద్యా-ఉపాధి-రాజకీయ-కుల సర్వే (SEEEPC) ఆధారంగా మరింత పారదర్శకంగా రూపొందించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →