Telangana Junior Colleges Midday Meal Scheme: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.

శనివారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 11వ, 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.
Telangana Junior Colleges Midday Meal Scheme అలాగే ‘ఇందిరమ్మ ఇళ్లు’ రెండో దశలో భాగంగా మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో ఇప్పటికే రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి వివరించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ప్రజల కోసం మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇక రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో “నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30”కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ RDSS పథకంలో రాష్ట్ర డిస్కంలు భాగస్వామ్యం కావడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే దీని లక్ష్యమని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ తదితర పనులకు రూ.587 కోట్ల మంజూరుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read More: Read Today’s E-paper News in Telugu
