Godavari Pushkaralu Funds: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.1,000 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Godavari Pushkaralu Funds ఈ భారీ ఆధ్యాత్మిక వేడుకల కోసం చేపట్టాల్సిన పనుల అమలుకు తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.587 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంకా పలు కీలక పరిపాలనా ప్రతిపాదనలను కూడా కేబినెట్ ఆమోదించింది. జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (DCMS)ను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGRIC)ను హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ (HACA)లో విలీనం చేయనున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్ టీచింగ్ పోస్టులు, 3 అవుట్‌సోర్సింగ్ పోస్టులను మంజూరు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఫైర్ స్టేషన్ కోసం 18 పోస్టులకు ఆమోదం లభించింది.
కరీంనగర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, BSF, CISF గ్రూప్ సెంటర్ల స్థాపన కోసం భూమి కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మనకొండూర్ మండలం వెలడిలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో మరో 5 ఎకరాలు కేటాయించనున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
