Telangana Heatwave Deaths: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా ఇప్పటివరకు 16 మంది మృ*తి చెందినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మృ*తుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు.

శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర సమీక్ష సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. మృ*తుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపారు.
Telangana Heatwave Deaths వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మే 26 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరమని అధికారులను ఆదేశించారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను గుర్తించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లని తాగునీరు, మజ్జిగ, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Telangana Heatwave Deaths అలర్ట్
ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu

