Telangana Inter Admissions 2026 : తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లకు యాంటీ డ్రగ్ అఫిడవిట్ తప్పనిసరి

Telangana Inter Admissions 2026: Telangana Board of Intermediate Education 2026 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్లలో కీలక మార్పు చేసింది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పొందాలంటే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించడం తప్పనిసరి.

Telangana Inter Admissions 2026 అఫిడవిట్ లేకుంటే అడ్మిషన్ లేదు

TG BIE విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థి , తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించాలి. ఈ డాక్యుమెంట్ సమర్పించిన తర్వాతే కాలేజీలు అడ్మిషన్ ఇవ్వాలని బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

తల్లిదండ్రుల ఆందోళనలు

ఈ నిర్ణయంపై కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటరీ అఫిడవిట్ కోసం లాయర్లను సంప్రదించాల్సి రావడం అదనపు ఖర్చు పడటం సమయం వృథా కావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

Advertisement

సులభ విధానం కోరుతున్న పేరెంట్స్

అఫిడవిట్ స్థానంలో సాధారణ రాతపూర్వక డిక్లరేషన్ తీసుకుంటే సరిపోతుందని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. దీంతో విద్యార్థులకు, కుటుంబాలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల మొదటి దశ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

ముఖ్య తేదీలు:
అప్లికేషన్‌ల చివరి తేదీ → మే 31
తరగతుల ప్రారంభం → జూన్ 1
మొదటి దశ అడ్మిషన్ల పూర్తి → జూన్ 30

ఎంట్రన్స్ టెస్టులకు నో బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ కాలేజీలు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించకూడదు. పదో తరగతి మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలి ,అని తెలిపింది.

ఆధార్ తప్పనిసరి

ఇంటర్ అడ్మిషన్లు కోరే ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలి ,అని TG BIE పేర్కొంది.

గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్

విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం TG BIE గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్ తీసుకోవాలని బోర్డు సూచించింది. గుర్తింపు పొందిన కాలేజీల జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లలో యాంటీ డ్రగ్ అఫిడవిట్ తప్పనిసరి చేయడం విద్యార్థుల్లో అవగాహన పెంచే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే దీనిని అమలు చేసే విధానంపై తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →