
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మైనారిటీ సంక్షేమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి 10 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కళాశాలలు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ఉపాధి కల్పించేలా ఆధునిక సాంకేతికతపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా ఈ Minority Degree Colleges లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నారు.
ముఖ్య నిర్ణయాలు ఇవే:
- AI & స్కిల్ ట్రైనింగ్: విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి నేరుగా ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దాలి.
- ఇన్సెంటివ్స్: BC, SC, ST విద్యార్థుల తరహాలోనే మెరిటోరియస్ మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలు అందించనున్నారు.
- గ్రూప్ అధికారులకు బాధ్యతలు: గ్రూప్-1, 2, 3 సర్వీసులకు ఎంపికైన మైనారిటీ అభ్యర్థులకు మైనారిటీ సంక్షేమ శాఖలో బాధ్యతలు ఇచ్చి మెంటార్‌లుగా నియమించనున్నారు.
- ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం: ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు గౌరవ వేతనాన్ని సకాలంలో విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
- మత సామరస్యం: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గుడితో పాటు మసీదు, చర్చి మరియు గురుద్వారాను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ఈ చర్యల ద్వారా తెలంగాణలోని గంగా-జముని తెహజీబ్ (Ganga-Jamuni Tehzeeb) సంస్కృతిని ప్రతిబింబించేలా అభివృద్ధి పనులు ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.
