సిరిసిల్ల: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని అజ్మీర అద్వైత నాయక్ అద్భుత ప్రతిభ కనబరిచింది. మొత్తం 600 మార్కులకు గాను ఏకంగా 594 మార్కులు సాధించి తన సత్తా చాటింది.

ఈ అత్యుత్తమ స్కోరు సాధించిన అద్వైతను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. తమ కూతురి ఘనవిజయం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
Read More: Read Today’s E-paper News in Telugu

