TCS Nashik Case Nida Khan: మహారాష్ట్రలోని పెద్ద కంపెనీకి సంబంధించిన కేసులో కొత్త మలుపు వచ్చింది ,Tata Consultancy Services (TCS) నాసిక్ BPO కేసులో నిందితురాలిగా ఉన్న Nida Khan ముందస్తు బెయిల్ (anticipatory bail) కోరేందుకు సిద్ధమవుతోంది.

TCS Nashik Case Nida Khan నిదా ఖాన్ ఏమంటోంది?
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిదా ఖాన్ తరఫు న్యాయవాది తెలిపారు,FIRల్లో బలవంతపు మత మార్పిడి గురించి ప్రస్తావన లేదని చెప్పారు, కొద్ది రోజుల్లో కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేస్తారు.
కుటుంబం చెప్పిన విషయం
నిదా ఖాన్ కుటుంబం కీలక విషయాలు చెప్పింది, ఆమె గర్భిణి అని తెలిపారు,ఆమె ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు,“ఆమె కేవలం టెలికాలర్ మాత్రమే… HR హెడ్ కాదు” అని కుటుంబం స్పష్టం చేసింది.
TCS Nashik Case Nida Khan కేసు అసలు విషయం
ఈ కేసు ఎలా ప్రారంభమైంది అంటే ఒక మహిళ ఉద్యోగి ఫిర్యాదు చేసింది, తన సీనియర్ డేనిష్ షేక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది,పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది.
ఇప్పటివరకు అరెస్టులు
మొత్తం 8 మంది అరెస్టు అయ్యారు, అందులో ఒక మహిళ HR ఉద్యోగి కూడా ఉంది, మరో ఇద్దరిని కోర్టు ఏప్రిల్ 18 వరకు పోలీస్ కస్టడీకి పంపింది,
ప్రధాన ఆరోపణలు
లైంగిక వేధింపులు, మానసిక హింస, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు ఈ కేసులో మొత్తం 9 FIRలు నమోదు అయ్యాయి,TCS స్పందన Tata Consultancy Services సంస్థ ఇలా తెలిపింది, ఇలాంటి ఘటనలపై “జీరో టోలరెన్స్” పాలసీ ఉంది,ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
పెద్ద సంస్థల దృష్టి
National Commission for Women విచారణ కమిటీ ఏర్పాటు చేసింది, National Human Rights Commission కూడా నోటీసు జారీ చేసింది. పూర్తి నివేదిక కోరింది.
పోలీసుల హెచ్చరిక
బాధితుల గుర్తింపు బయటపెట్టడం నేరం,సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
TCS నాసిక్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది ,నిజాలు బయటపడాల్సి ఉంది, కోర్టు నిర్ణయం కీలకం కానుంది.
Read More: Read Today’s E-paper News in Telugu

