Telangana Entertainment Tax: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, అమ్యూజ్‌మెంట్ పార్కులు వంటి వినోద రంగాలపై ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

ఈ నిర్ణయం అమలులోకి వస్తే, పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.
స్టడీ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావు నేతృత్వం వహిస్తున్నారు. వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
Telangana Entertainment Tax కమిటీ పని:
ఇతర రాష్ట్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ విధానం ఎలా ఉంది? స్థానిక సంస్థలు ఎలా ఆదాయం పొందుతున్నాయి? తెలంగాణలో అమలు సాధ్యమా?రిపోర్ట్ టైమ్‌లైన్ ప్రభుత్వం ఈ కమిటీకి స్పష్టమైన గడువు ఇచ్చింది.
- 30 రోజుల్లో – ప్రాథమిక నివేదిక
- 60 రోజుల్లో – తుది నివేదిక
ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
GST తర్వాత మారిన పన్ను విధానం 101st Constitutional Amendment of India తర్వాత రాష్ట్రాల పన్ను విధించే అధికారాల్లో మార్పులు వచ్చాయి.
ఈ సవరణ ద్వారా చాలా పన్నులు GST కిందకి వెళ్లాయి, కానీ స్థానిక సంస్థలకు కొన్ని పన్నులు విధించే అవకాశం ఇచ్చారు . ముఖ్యంగా స్థానిక సంస్థలు (పంచాయతీ, మున్సిపాలిటీలు) వినోదం, అమ్యూజ్‌మెంట్‌పై ట్యాక్స్ విధించవచ్చు.
Telangana Entertainment Tax ఎవరి మీద ట్యాక్స్ పడొచ్చు?
ఈ ప్రతిపాదన అమలైతే సినిమా థియేటర్లు , అమ్యూజ్‌మెంట్ పార్కులు , ఇతర వినోద కేంద్రాలు పైవన్నీ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది
ప్రజలపై ప్రభావం ఏమిటి?
ఈ నిర్ణయం అమలైతే టికెట్ ధరలు పెరగవచ్చు , స్థానిక సంస్థలకు ఆదాయం పెరుగుతుంది , అభివృద్ధి పనులకు నిధులు లభిస్తాయి. అయితే, ప్రజలపై అదనపు భారం పడే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. అమలు తేదీ ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ మళ్లీ రావొచ్చనే ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల అభివృద్ధికి ఇది సహాయపడినా, ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.వచ్చే 60 రోజులు కీలకం..
Read More: Read Today’s E-paper News in Telugu

