Hyderabad Summer Trip: ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్‌లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో చాలా మంది హిల్ స్టేషన్స్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు.

Hyderabad Summer Trip హైదరాబాద్ దగ్గరే, 200KM సమ్మర్‌లో కూల్ అవ్వడానికి టాప్ ప్లేసెస్
వీకెండ్‌లో చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్
1. Gottam Gutta – మినీ కాన్యాన్ ఫీలింగ్
దూరం: సుమారు 130 KM
Gottam Gutta ను “Mini Canyon” అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న కొండలు, లోయలు, నీటి వ్యూస్ చూస్తే మీరు ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు.

సాయంత్రం సన్‌సెట్ టైమ్‌లో వెళ్లితే ఫోటోలు సూపర్‌గా వస్తాయి.
2. Pocharam Wildlife Sanctuary – నేచర్ + జంతువులు
దూరం: సుమారు 115 KM
ఇది ఒకప్పుడు నిజాం కాలంలో వేట కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు ఇది ఒక అందమైన వైల్డ్‌లైఫ్ స్పాట్.
Pocharam Wildlife Sanctuary ఇక్కడ మీరు జింకలు , పక్షులు , ప్రశాంతమైన నేచర్ చూడొచ్చు. సమ్మర్‌లో నీటి దగ్గర జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి.

3 . Rachakonda Fort – అడ్వెంచర్ + హిస్టరీ
దూరం: సుమారు 90 KM
Rachakonda Fort 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట ట్రెక్కింగ్ ప్రేమికులకు బెస్ట్ స్పాట్.
ప్రత్యేకత రాళ్లతో నిర్మించిన కోట , ఎక్కే సమయంలో చల్లని గాలి అడ్వెంచర్ ఫీలింగ్..

4 . Singur Dam & Manjira Sanctuary – కూల్ వాటర్ వైబ్స్
దూరం: సుమారు 100 KM
Singur Dam & Manjira Sanctuary ఇక్కడ నీటి దగ్గర ఉండటం వల్ల వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది.
ఇక్కడ మీరు బోటింగ్, మొసళ్లు పీస్‌ఫుల్ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు.

5 . Mallela Theertham – అడవుల్లో జలపాతం
దూరం: సుమారు 200 KM
Mallela Theertham నల్లమల అడవుల్లో ఉన్న ఈ జలపాతం సమ్మర్‌లో కూడా నీటితో ఉంటుంది.
ప్రత్యేకత అడవుల్లో కూల్ వాతావరణం , మిస్ట్ ఎఫెక్ట్ , రిలాక్సింగ్ ఫీల్

Hyderabad Summer Trip ఎందుకు ఈ ప్లేసెస్ బెస్ట్?
హైదరాబాద్ నుంచి 200KM లోపలే వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ చల్లగా ఫీల్ అయ్యే ప్రదేశాలు నేచర్ + అడ్వెంచర్ రెండు కూడా
సమ్మర్‌లో హీట్ నుంచి తప్పించుకోవాలంటే దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ దగ్గరే ఉన్న ఈ ప్లేసెస్ మీకు కూల్ & రిఫ్రెషింగ్ అనుభవం ఇస్తాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
