
ఏప్రిల్ 6, 2026 సోమవారం నాటి Horoscope today Telugu రాశిఫలాలు ఇవాళ చాలా రాశుల వారికి ఆర్థికంగా మరియు వృత్తి పరంగా అనుకూల ఫలితాలు చూపిస్తున్నాయి. మేష మరియు వృషభ రాశుల వారికి ఆదాయం పెరగడం, ప్రయత్నాలు సఫలం కావడం జరుగుతాయి. మీ రాశి ఫలం చదవండి!
తేదీ: ఏప్రిల్ 6, 2026 — సోమవారం
ప్రత్యేకత: వృషభ, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి నిరుద్యోగులకు శుభవార్త
జాగ్రత్త అవసరం: మిథున, మకర, కుంభ రాశుల వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
12 రాశుల దిన ఫలాలు — ఏప్రిల్ 6, 2026
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. శుభ గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బకాయిలు వసూలవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. సొంత వాహనాలను వేగంగా నడపకపోవడం శ్రేయస్కరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపారంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలకు లోటుండదు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. అనారోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
Horoscope Today Telugu — మిగతా రాశులు
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అత్యధికంగా లాభం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా చిక్కుల్లో పడతారు. మనసు లోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. వాహనం కొనే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.

