జగిత్యాల : ఇస్రో యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థి

తెలంగాణ పత్రిక (APR.14), జగిత్యాల – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువిక-2025, యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాల కు చెందిన 9 వ తరగతి విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన ఎనిమిది పరిశోధన కేంద్రాలలో మే నెలలో పన్నెండు రోజుల పాటు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాల విద్యార్థి కొలకాని అశ్విని హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో జరిగే శిక్షణకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన పన్నెండు మంది విద్యార్థులలో అశ్విని ఒకరు. వివిధ రకాల అంశాలు,ఆన్లైన్ పోటీ మరియు చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా అశ్విని ఈ కార్యక్రమానికి ఎంపికైంది.అశ్విని . ఇస్రో యువిక కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ బి.లావణ్య సంతోషం వ్యక్తం చేసారు.భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు మరియు ఆదర్శ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేసారు. అశ్వినిని పాఠశాల ప్రిన్సిపల్ పాటు ఉపాధ్యాయులు ప్రణిత, పద్మప్రియ,తబస్సుమ్ భాగ్యలక్ష్మి, శరణ్య, శిరీష, విజయ్ కుమార్, రాజేశం, శ్రీధర్,సత్యానందం అభినందించారు.పాఠశాలలో అందించిన ప్రోత్సాహంతోనే ఎంపికయ్యను.

Advertisement
Advertisement

జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాల విద్యార్థి కొలకాని అశ్విని మాట్లాడుతూ..


(ఇస్రో యువిక కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థిని) ఈ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతానికి చెందిన నేను ఎంపిక కావడం ఆనందంగా ఉంది.ఇస్రో గూర్చి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించించినందుకు సంతోషంగా ఉంది.పాఠశాల ప్రిన్సిపల్ మేడం, సైన్స్ ఉపాధ్యాయులు, రమణ సర్ ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమానికి ఎంపికయ్యా.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →