RBI new rules April 1: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులపై కీలక మార్పు అమల్లోకి వచ్చింది. ఇకపై UPI సహా అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్లకు రెండు-స్థాయి భద్రత (2FA) తప్పనిసరి చేసింది కేంద్ర బ్యాంక్.

Reserve Bank of India (RBI) ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ మోసాలను తగ్గించడం మరియు ట్రాన్సాక్షన్లలో భద్రతను పెంచడం. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
ఇప్పటి వరకు చాలా మంది కేవలం UPI PIN ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు PINతో పాటు మరో వెరిఫికేషన్ స్టెప్ తప్పనిసరి అయింది. ఇది OTP, ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ రూపంలో ఉండవచ్చు.
ఈ కొత్త సిస్టమ్ వల్ల, ఎవరికైనా మీ PIN తెలిసినా, రెండో వెరిఫికేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ పూర్తికాదు. దీంతో ఫ్రాడ్ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
RBI new rules April 1 ఫ్రాడ్‌కు చెక్
అదనంగా, బ్యాంకింగ్ యాప్స్‌లో స్క్రీన్‌షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్ పూర్తిగా నిషేధించారు. ఇది యూజర్ల డేటాను రక్షించేందుకు తీసుకున్న మరో ముఖ్య నిర్ణయం.
అయితే, ఈ 2FA వల్ల ట్రాన్సాక్షన్ సమయంలో కొద్దిపాటి ఆలస్యం ఉండొచ్చు. OTP లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉండటంతో కొన్ని సెకన్లు ఎక్కువ సమయం పడుతుంది.
నిపుణుల ప్రకారం, వేగంగా జరిగే UPI ట్రాన్సాక్షన్లలో ఫ్రాడ్‌ను అరికట్టడానికి ఇది చాలా అవసరమైన మార్పు. యూజర్ ఎవరు, ఏ డివైస్ ఉపయోగిస్తున్నారు, ఏ వివరాలు ఇస్తున్నారు అనే అంశాలను కలిపి రియల్ టైమ్‌లో వెరిఫై చేయడం ద్వారా భద్రతను పెంచుతున్నారు.
మొత్తానికి, ఈ కొత్త 2FA నిబంధన డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా మార్చబోతోంది. వినియోగదారులు కూడా ఈ మార్పులకు అలవాటు పడాల్సిన అవసరం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu

