తెలంగాణ పత్రిక (APR.14), Nizamabad – నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం నందిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నిజామాబాద్ (Nizamabad) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి,రికార్డులు,కేసుల పురోగతిపై వివరాలు తీసుకున్నారు. నందిపేట,డొంకేశ్వర్ మండలాల్లో పోలీసు సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పోలీస్ కమిషనర్ సూచించారు.
మండలాల్లో ఉన్న రౌడీ షీటర్లు,సస్పెక్ట్ షీటర్లు,కమ్యూనల్ షీటర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని ఎస్ హెచ్ వో చిరంజీవిని ఆదేశించారు.
ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుల పాత్ర కీలకమని, ప్రతి ఘటనపై స్పందన వేగంగా ఉండాలన్నారు. నేరాల నివారణకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు
Read More: Read Today’s E-paper News in Telugu
