Advertisement

Sircilla News Update: సిరిసిల్లకు గర్వకారణం మహమ్మద్ ముస్తఫా గారికి గౌరవ డాక్టరేట్‌.

తెలంగాణ పత్రిక (APR.13) :Sircilla News Update . సిరిసిల్ల పట్టణానికి చెందిన మహమ్మద్ ముస్తఫా గారు గత 20 సంవత్సరాలుగా మానవతా సేవల్లో నిరంతరంగా భాగస్వామిగా ఉన్నారు. అనాధ శవాలకు అంత్యక్రియలు చేయడం, పేదలకు అత్యవసర వైద్య సేవలు అందించడం, కరోనా సమయంలో కులమతాలకు అతీతంగా దహన సంస్కారాలు నిర్వహించడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండారు. ఆయన సేవలకు కేవలం ప్రాంతీయ స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Sircilla News Update mohammad musthafa

ఈ సేవా నిబద్ధతను గుర్తించిన వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ వారు, ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సిమినార్‌లో మహమ్మద్ ముస్తఫా గారికి గౌరవ డాక్టరేట్‌ (Honorary Doctorate) ని అందించారు. ఈ బిరుదుతో ఆయనను “డాక్టర్ మహమ్మద్ ముస్తఫా”గా పిలవవచ్చు.

Advertisement

సమాజ సేవను తన జీవిత ధ్యేయంగా తీసుకుని, రాత్రింబవళ్లు పేద ప్రజల కోసం పని చేసిన ముస్తఫా గారికి లభించిన ఈ గౌరవ డాక్టరేట్ ఆయన అంకితభావానికి వచ్చిన సముచిత గుర్తింపు. ఆయన సేవలు రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

siricilla mohammad musthafa honorary doctorate 2025

Read More: Gambhiraopet: గంభీరావుపేట మండలం సిరిసిల్లలో బాలుడిపై టీచర్ దాడి 2025

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →