Advertisement

Gas Cylinder Crisis Hyderabad 2026 | రూ.4,000కు సిలిండర్.. ఏజెన్సీల భారీ దోపిడీ!

Gas Cylinder Crisis Hyderabad 2026 – Agencies Selling LPG at Rs 4000 Black Market Price

హైదరాబాద్‌లో Gas Cylinder Crisis Hyderabad 2026 తీవ్ర రూపం దాల్చింది. గ్యాస్ ఏజెన్సీలు కావాలని కృత్రిమ కొరతను సృష్టిస్తూ సామాన్య ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. అధికారికంగా బుక్ చేసుకున్న వారికి “స్టాక్ లేదు” అని చెప్పే ఏజెన్సీలు, రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ముట్టజెప్పే వారికి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఏజెన్సీలు

మహారాష్ట్ర నుంచి అక్రమ తరలింపు

గ్రేటర్ హైదరాబాద్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి సిలిండర్లు అక్రమంగా తరలిస్తున్నారు. మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఈ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Gas Cylinder Crisis Hyderabad 2026 – హోటళ్లు మూతపడుతున్నాయి

బావర్చి హోటల్ మూత

హైదరాబాద్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బావర్చి హోటల్ గ్యాస్ కొరత కారణంగా బుధవారం తాత్కాలికంగా మూతపడింది. ఇది నగరంలో గ్యాస్ సంక్షోభానికి అద్దం పట్టింది.

ITC వంటి పెద్ద హోటళ్లకూ ముప్పు

ITC వంటి దిగ్గజ హోటల్ గ్రూపులు సైతం తమ ఆహార సేవలలో అంతరాయం కలగవచ్చని కస్టమర్లకు ముందే హెచ్చరిస్తున్నాయి.

ఆలయాల్లో నిత్యాన్నదానానికి గండం

రోజుకు 5 వేల కిలోల గ్యాస్ అవసరమయ్యే యాదగిరిగుట్ట ఆలయంలో కేవలం 4 రోజుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి, గణేశ్ ఆలయాల్లో కూడా 2–3 రోజులకు మించి గ్యాస్ లేదు. ఈ పరిస్థితిపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు చమురు సంస్థలతో అత్యవసర సమీక్ష నిర్వహించి, ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

కట్టెల పొయ్యిలకు పెరిగిన డిమాండ్

గ్యాస్ కొనలేక ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, విద్యార్థులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ కట్టెల ధరను కిలో రూ.10 నుంచి రూ.20కి పెంచి సామాన్యుడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు.

మరిన్ని వివరాలకు: 🔗 ppac.gov.in

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →