Telangana Municipal Vote Counting: తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు నిర్వహించనున్నారు.

Telangana Municipal Vote Counting కట్టుదిట్టమైన భద్రత
కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల కోసం BNSS సెక్షన్ 163 అమల్లో ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ హాల్‌లోకి కేవలం:
- కౌంటింగ్ సూపర్వైజర్లు
- కౌంటింగ్ అసిస్టెంట్లు
- అభ్యర్థులు
- వారి ఎన్నికల ఏజెంట్లు
మాత్రమే అనుమతించబడతారు. చెల్లుబాటు అయ్యే పాస్ లేకుండా ప్రవేశం లేదు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం.
పారదర్శకత కోసం వెబ్‌కాస్టింగ్
ప్రతి కౌంటింగ్ సెంటర్‌లో, స్ట్రాంగ్ రూమ్ వెలుపల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుంది.
ఓట్ల లెక్కింపు విధానం
మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.
అనంతరం సాధారణ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ప్రతి వార్డు బ్యాలెట్ బాక్సులను వరుసగా కౌంటింగ్ టేబుల్‌కు తీసుకువస్తారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బండిల్స్‌గా కట్టడం జరుగుతుంది. 25 కంటే తక్కువ ఉంటే వాటిని ప్రత్యేకంగా లేబుల్ చేస్తారు.
వార్డు పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ల బ్యాలెట్లను ఒక డ్రమ్‌లో వేసి బాగా కలుపుతారు. అనంతరం ప్రతి రౌండ్‌లో 1,000 బ్యాలెట్లు (40 బండిల్స్) యాదృచ్ఛికంగా తీసుకుని లెక్కింపు టేబుల్‌కు పంపిస్తారు. ఇదే విధానం ప్రతి వార్డు కోసం పునరావృతమవుతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
