Jaahnavi Kandula Settlement: సియాటిల్‌లో వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులా కుటుంబానికి ₹262 కోట్ల పరిహారం. ఈ కేసు పోలీస్ బాధ్యతపై తీవ్ర చర్చలకు దారితీసింది.

అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులా మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాహ్నవి కుటుంబానికి ₹262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటిల్ నగర ప్రభుత్వం అంగీకరించింది.
Jaahnavi Kandula Settlement ప్రమాదం ఎలా జరిగింది?
2023లో 23 ఏళ్ల జాహ్నవి కందులా రోడ్డును దాటుతుండగా, అత్యవసర కాల్‌కు స్పందిస్తూ వెళ్తున్న పోలీస్ అధికారి కేవిన్ డేవ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. సమాచారం ప్రకారం, ఆ అధికారి 40 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న ప్రాంతంలో గంటకు 119 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఎమర్జెన్సీ లైట్లు ఆన్‌లో ఉన్నప్పటికీ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
జాహ్నవి సియాటిల్‌లోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. ఆమె ఆకస్మిక మరణం భారతీయ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది.
అధికారుల స్పందన
సియాటిల్ సిటీ అటార్నీ ఎరికా ఎవాన్స్ ప్రకటనలో, “జాహ్నవి జీవితం విలువైనది. ఈ ఆర్థిక పరిహారం కుటుంబానికి కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం ₹262 కోట్లలో సుమారు ₹167 కోట్లు నగర బీమా ద్వారా చెల్లించబడతాయి.
వివాదాస్పద వ్యాఖ్యలు, నిరసనలు
ఈ ఘటన తర్వాత మరో పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. బాడీ కెమెరా రికార్డింగ్‌లో ఆ అధికారి నవ్వుతూ “చెక్ రాస్తే సరిపోతుంది” అన్నట్టు మాట్లాడినట్లు వెలుగులోకి రావడంతో నిరసనలు చెలరేగాయి. ఆ అధికారి తరువాత ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు.
అలాగే, వాహనం నడిపిన అధికారిపై నిర్లక్ష్య డ్రైవింగ్ కేసు నమోదు చేసి ₹4.53 లక్షల జరిమానా విధించారు. అయితే తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సరిపడా ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
