Medaram Jatara:మేడారం జాతర హుండీ ఆదాయం రూ.6.04 కోట్లు

Telangana Patrika (Feburary 7): Medaram Jatara మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో హుండీ ఆదాయం రూ.6.04 కోట్లకు చేరింది. రెండు రోజులుగా హుండీల లెక్కింపు కొనసాగుతోంది.

Medaram Jatara మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో హుండీ ఆదాయం రూ.6.04 కోట్లకు పైగా చేరింది. హుండీ నగదు లెక్కింపు ప్రక్రియ శుక్రవారం రెండో రోజూ కొనసాగింది.

Advertisement

అధికారుల వివరాల ప్రకారం, గురువారం మొదటి రోజు 125 హుండీల నుంచి రూ.2.49 కోట్లు లెక్కించారు. శుక్రవారం 160 హుండీలను తెరిచి రూ.3.54 కోట్లు లభించాయి.

Advertisement

ఇక విదేశీ కరెన్సీ రూపంలో రూ.63,436 కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మేడారం జాతర ప్రాంగణంలో మొత్తం 780 హుండీలు ఏర్పాటు చేశారు. వీటిలో

Advertisement
  • సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద 309 చొప్పున ఇనుప హుండీలు
  • గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద 81 చొప్పున హుండీలు
  • అలాగే 3 గుడ్డ హుండీలు, 3 బియ్యం హుండీలు ఉన్నాయి.

హుండీ లెక్కింపు ప్రక్రియను నిర్దిష్ట విధానాల ప్రకారం కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More: Read Today’s E-paper

Advertisement

About Gnaneshwar kokkula

Hi, I’m Kokkula Gnaneshwar — content creator and digital publisher. I run Telangana Patrika (Telugu news, culture & space updates) and Freshers Job Dost (govt & private job updates). My goal is to share useful, accurate info that helps readers stay informed and ahead.

View all posts by Gnaneshwar kokkula →