Hyderabad Metro Phase 2 funds: హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (ఫేజ్–2) కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ₹28,740 కోట్ల నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి ప్రకటించారు.

Hyderabad Metro Phase 2 funds నాంపల్లి లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మెట్రో ఫేజ్–1కు సంబంధించి ఎల్ అండ్ టి (L&T)తో తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ ఒప్పందాన్ని పూర్తి చేసి, ఫేజ్–2కు సంబంధించిన డీపీఆర్ (Detailed Project Report) సమర్పిస్తే కేంద్రం వెంటనే నిధులు విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.
Hyderabad Metro Phase 2 funds తెలంగాణకు కేంద్రం నుంచి భారీ నిధుల ప్రవాహం
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 41 శాతం పన్ను వాటా కింద తెలంగాణకు ₹33,180 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు ₹11,448 కోట్లు కేంద్రం నుంచి అందనున్నాయని ప్రల్హాద్ జోషి తెలిపారు. గత 12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ₹12.5 లక్షల కోట్ల నిధులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
రైల్వే మౌలిక సదుపాయాలకు రికార్డు కేటాయింపు
2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో ₹5,337 కోట్లు కేటాయించామని జోషి తెలిపారు. యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేవలం ₹886 కోట్లు మాత్రమే వచ్చాయని ఆయన పోల్చిచెప్పారు.
భవిష్యత్ భారత్ కోసం కేంద్ర బడ్జెట్
భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో, మౌలిక వసతుల అభివృద్ధికి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను ₹12 లక్షల కోట్లకు పెంచినట్లు ప్రల్హాద్ జోషి వివరించారు.
సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు అవసరమైన 24 కీలక ఖనిజాలను కేంద్రం గుర్తించిందని తెలిపారు.
కాంగ్రెస్‌పై విమర్శ
నిధుల విడుదలపై వచ్చిన ప్రశ్నకు స్పందించిన జోషి, “కేంద్ర ప్రభుత్వం నిధులను కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు కాదు, ప్రజల అభివృద్ధికే నేరుగా ఖర్చు చేస్తుంది” అని వ్యాఖ్యానించారు.
వ్యాపారులతో సంభాషణ
తర్వాత బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వ్యాపారి సంవాద్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం రాష్ట్ర ప్రతినిధులు ఎన్.వి. సుభాష్, వీరేందర్ గౌడ్ వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu

