
తెలంగాణ పత్రిక (APR.11), POLYCET 2025: సిరిసిల్ల పోపా పాలిసెట్ శిక్షణ
పదవ తరగతి విద్యార్థుల పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడానికై సిరిసిల్ల పోపా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ శిక్షణ శిబిరాన్ని సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పోపా ఉపాధ్యక్షుడు మామిడాల భూపతి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్రం శ్రీనివాస్, ఎంఈఓ దూస రఘుపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్ పాల్గొన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల నేతృత్వంలో 30 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది.
సుమారు 130 మంది విద్యార్థులు శిబిరానికి హాజరయ్యారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu


Comments are closed.