Kadiyam Srihari Disqualification Case: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హతకు సంబంధించిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది. ఈ విచారణను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన చాంబర్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం శాసనసభ కార్యదర్శి ఆర్. తిరుపతి ద్వారా కడియం శ్రీహరికి నోటీసులు అందజేశారు.

Kadiyam Srihari Disqualification Case అనర్హత పిటిషన్ నేపథ్యం
BRS ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.
ఇంతకుముందు సెప్టెంబర్ 20న కడియం శ్రీహరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు కూడా
స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ సమయంలో కడియం శ్రీహరి స్పందనకు అదనపు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.
Kadiyam Srihari Disqualification Case గతంలో ఇచ్చిన క్లియర్ చిట్
ఇటీవల స్పీకర్ BRS నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన 10 మందిలో 7 మంది ఎమ్మెల్యేలకు క్లియర్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో
“వారు ఎటువంటి పార్టీకి అధికారికంగా చేరలేదు. ఇప్పటికీ BRSతోనే అనుబంధం కలిగి ఉన్నారు” అని స్పీకర్ వ్యాఖ్యానించారు. డాక్టర్ సంజయ్ కుమార్ కేసుపై ఇంకా నిర్ణయం లేదు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
రాజకీయంగా కీలకంగా మారిన కేసు
కడియం శ్రీహరి అనర్హతపై జరిగే ఈ విచారణ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాబోయే రోజుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయం BRS – కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
