KCR SIT Investigation Farmhouse: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులను విచారించిన SIT, తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

జనవరి 30న SIT కార్యాలయానికి హాజరుకావాలని కేసీఆర్‌కు నోటీసులు అందగా, ఆయన అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. SIT కార్యాలయానికి తాను హాజరుకానని, బదులుగా చట్టపరమైన హక్కును వినియోగించుకుంటున్నట్లు పోలీసులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.
KCR SIT Investigation Farmhouse చట్టాన్ని ప్రస్తావించిన కేసీఆర్
తన సమాధానంలో కేసీఆర్, “65 ఏళ్లు దాటిన పురుషులను పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదన్న నిబంధన చట్టంలో ఉంది. అలాంటి వ్యక్తిని అతను నివసించే ప్రదేశంలోనే విచారించాలి” అని స్పష్టం చేశారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విచారణకు సిద్ధం
SIT అధికారులు కోరితే, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విచారణకు సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు. ముందస్తు సమాచారం ఇస్తే, తనకు అనుకూలమైన తేదీన విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.
SIT ముందున్న కొత్త సవాల్
కేసీఆర్ ఈ నిర్ణయంతో, SIT ముందు కొత్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అధికారులు కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించి ఫామ్ హౌస్‌కు వెళ్లి విచారణ చేస్తారా? లేదా మరో నిర్ణయం తీసుకుంటారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
KCR SIT Investigation Farmhouse రాజకీయంగా కీలక సమయం
మున్సిపల్ ఎన్నికల వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ విచారణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందన్న దానిపై SIT అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
