Advertisement

Ration Cards 2025: కొత్త రేషన్ కార్దుల్లో గందరగోళం, వేరు కుటుంబాలకు ఒకటే కార్డు జారీ

తెలంగాణ పత్రిక – ప్రతినిధి, ఏప్రిల్ 10: Ration Cards 2025. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల జాబితాలో అన్ని తప్పులే ఉన్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని ఎన్నిక హామీలో చెప్పింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రతి ఒక్కరికీ ఇస్తామని చెప్పగానే అభయహస్తం పథకం ద్వారా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ సభల్లో మండల అధికారులు చెప్పిన పేర్లు నేడు ఆన్లైన్లో ఉన్న పేర్లకు పొంతన లేదని ప్రజలు వాపోతున్నారు. మునగాల మండలంలో చాలా గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కొత్త కార్డులు రాకుండా వాల్ల కుటుంబ సభ్యులందరినీ కలిపి ఒకే కార్డుగా సూచించారు. గతంలో కార్డు లో ఉన్న వాళ్ళ పేర్లు లు కొందరివి లేకుండా చేశారని చెప్తున్నారు. కొత్తగా ఇస్తారనుకుంటే పాత కార్డు లోనే కొత్తవారిని చేర్చడం ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. రెండు వేరు కుటుంబాలు ఉన్నప్పటికీ ఒక్క కార్డులోనే పేర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్తవారికి వేరే కార్డులు జారీ చేస్తే బాగుంటుందని వాపోయారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

వేరు కుటుంబాలకు ఒకటే కార్డు జారీ

కొత్త రేషన్ new ration cards 2025 updates
new ration cards 2025 updates

Read More : Vemulawada: వేములవాడలో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Advertisement

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →