Advertisement

Karimnagar Government Hospital Delivery : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం ఆదర్శంగా కమిషనర్

Karimnagar Government Hospital Delivery: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని మరింత పెంచేలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రఫుల్ దేశాయ్ ఒక మంచి ఉదాహరణగా నిలిచారు. తన భార్య ప్రసవం కోసం ఆయన ప్రైవేట్ ఆస్పత్రిని కాకుండా ప్రభుత్వ ఆస్పత్రినే ఎంచుకున్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఆదివారం రోజున తన గర్భిణీ భార్యను కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం (Mother & Child Health Centre)లో చేర్పించారు. పరీక్షల సమయంలో ఆమెకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ స్థాయి తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తక్షణమే అవసరమైన వైద్య చర్యలు చేపట్టారు.

Advertisement

సోమవారం రోజున అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, స్పెషలిస్ట్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా ప్రసవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆడ శిశువు జన్మించింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • ఈ ప్రసవంలో
  • గైనకాలజీ విభాగాధిపతి డా. పద్మజ,
  • వైద్యులు డా. దీప, డా. సంజీత, డా. సుహాసిని,
  • శిశు వైద్యులు డా. వేణు, డా. మల్లికార్జున్,
  • అనస్థీషియా విభాగాధిపతి డా. శాంతన్, డా. సంగీత,
  • నర్సింగ్ సూపరింటెండెంట్ సరిత, నర్సులు పద్మశ్రీ, రమ కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పామెలా సత్యపథి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. వీరారెడ్డి, RMO నవీనా తదితరులు కమిషనర్ ప్రభుల్ దేశాయ్ దంపతులను అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఉత్తమ వైద్యం అందుబాటులో ఉందని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ నిర్ణయం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →