KCR names baby Suman: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మరోసారి తన అభిమానుల మనసులు గెలుచుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో ఒక అభిమాన దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌ను కలిశారు.

ఆ దంపతుల అభ్యర్థన మేరకు, ఒక వేద పండితుడి సలహా తీసుకొని, శిశువు జన్మ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుని కేసీఆర్ శిశువుకు ‘సుమన్’ అనే పేరు పెట్టారు. చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించిన ఆయన, దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కలగాలని కోరుకున్నారు.
KCR names baby Suman ఇలాంటి సందర్భాలు కేసీఆర్‌కు కొత్తవి కావు. గతంలో కూడా పలువురు అభిమానులు తమ పిల్లలకు పేరు పెట్టాలని ఆయనను అభ్యర్థించగా, ఆయన సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించారు. ఇది కేసీఆర్‌కు ఉన్న ప్రజా ఆదరణకు మరో నిదర్శనంగా కనిపిస్తోంది.
అదే రోజు కేసీఆర్ నివాసం అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన శ్రేయోభిలాషులు ఆయనను కలవగా, కేసీఆర్ చిరునవ్వుతో సెల్ఫీలు దిగుతూ అందరినీ ఆదరించారు.
రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానులతో ఈ తరహా వ్యక్తిగత అనుబంధం కొనసాగించడం కేసీఆర్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
Read More: Read Today’s E-paper News in Telugu
