Sarpanch Oath Taking Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 22కు వాయిదా పడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 20న నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, శుభదినం కాదన్న కారణంతో ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు తేదీని మార్చారు.

పంచాయతీ రాజ్ శాఖ ఈ మార్పును అధికారికంగా ధృవీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు అందరూ డిసెంబర్ 22న ఒకే రోజు తమ పదవుల బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే రోజు గ్రామ పంచాయతీ తొలి సమావేశంలో ప్రమాణ స్వీకారం జరగనుంది.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి త్వరలో హైదరాబాద్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించేందుకు యోచిస్తున్నారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత, అధికారాల వినియోగంలో ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం వంటి అంశాలపై చర్చించనున్నారు.
గ్రామ స్థాయి పాలన మరింత బలోపేతం కావాలంటే సర్పంచ్‌లకు సరైన నిధులు, అధికారాలు అవసరమని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వనుందని సమాచారం.
డిసెంబర్ 22తో తెలంగాణ గ్రామ పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. గ్రామాభివృద్ధిపై ప్రజల్లో కూడా ఆశలు పెరిగాయి.
Read More: Read Today’s E-paper News in Telugu

