Panchayat Secretary Abuse, కాలుజారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేమని అంటారు. తాజా మాజీ వార్డ్ నెంబర్ పై గ్రామపంచాయతీ కార్యదర్శి దురుసు మాటలు తక్షణమే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కు వినతి.వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జి.శ్రవణ్ కు ఆగస్టు 9వ తారీకు సాయంత్రం ఏడు గంటల సమయంలో తాజా మాజీ వార్డ్ నెంబర్ పుట్టల సందీప్ ఫోన్ చేసి బోనాల పండుగ గురించి వివరణ అడుగగా,ప్రజా సమస్యల పై మాట్లాడినందుకు సందీప్ ను ఇష్టం వచ్చినట్లు వివిధ రకాల పదజాలంతో దురుసుగా మాట్లాడిన కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు కార్యదర్శి చరవాణిలో మాట్లాడిన రికార్డ్ లను వినిపించి వినతి పత్రం అందజేశారు.
మాజీ వార్డ్ నెంబర్ పై దురుసు మాటలు
తాజా మాజీ వార్డ్ నెంబర్ పుట్టల సందీప్
