Telanganapatrika (July 17): Unauthorized Layouts Telangana , అధికారుల అండదండలతో అక్రమ వెంచర్లు వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.దీనిపై పత్రికలో కథనాలు నోటీసు జారీ చేశామని చెప్పి న చేతులు దులుపుకున్నారు.

Unauthorized Layouts Telangana నోటీసులు జారీ చేశాం…చర్యలు తీసుకుంటాం..
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం లోని గోపాలగిరి గ్రామ శివారులో బాల మైసమ్మ దేవాలయం వెనుక భాగంలో, సర్వే నెంబర్ 44/B/1/1/1/1/2, లో సుమారు రెండు ఎకరాల పైచిలుకు,నాన్ లేఔట్ వెంచర్ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ భారీ స్థాయిలో వెంచర్ పనులు చేపడుతున్నారు. అనుమతులు లేని వెంచర్ లో పనులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.ఈ అక్రమ వెంచర్ పై పలుమార్లు కథనాలు రాసిన అధికారులు మాత్రం నోటీసులు జారీ చేశాం,హద్దు రాళ్లు తీసేస్తామని మాటలు చెపుతు దాటవేస్తున్నారు.పట్టణంలో సొంతిల్లు కట్టుకోవాలని కళతో స్థలాలు కొనుక్కోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. దీనిని అవకాశంగా మలచుకొని రియల్టర్లు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పడి చర్యలు మరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా పలు సార్లు పత్రికలో ఈ అక్రమాలపై కథనాలు వచ్చినా, తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్వీర్యంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. దీంతో స్థానికుల ఆరోపణల ప్రకారం, అధికారులకు ముడుపులు అందుతున్న నేపథ్యంలో వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలుచోట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు ఒకటి చెబుతూ, మరొకటి చేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని అంటున్నారు.అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు గప్ చుప్ గా ఉండడం పట్ల అధికారులపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.వెంచర్ నిర్వాహకులకు అధికారులు కొమ్ముకాస్తున్నారా…?అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Unauthorized Layouts Telangana ఎం.పీ.ఓ జాడేక్కడ..?
వ్యవసాయ భూమినీ అక్రమ వెంచర్ గా మార్చి అమ్మకాలు జరుగపుతున్న కూడా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఇది అధికారుల మౌనసమ్మతంతోనే జరిగిందనీ స్థానికుల ఆరోపిస్తున్నారు.ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికాదా..? అయిన కూడా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి…? అధికారులకు ముడుపులు మట్టయా..? లేదా పట్టించుకోవడం లేదా..?
రాజకీయ నాయకుల ఒత్తిడి ఏం ఆయిన ఉందా..? అనే విమర్శలు తలెత్తున్నాయి.తొర్రూరు ఎం పీ ఓ నిర్లక్ష్యంతో ప్రతిరోజూ పెరుగుతున్న అక్రమ వెంచర్ల సంఖ్యకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రజల నమ్మకమే దెబ్బతింటుందని పలువురు హితవుపలుకుతున్నారు.దీనిపై ఇప్పటికైనా ఎంపీవో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu