Telanganapatrika (July 19): Telangana Local Body Elections , తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పంచాయతీరాజ్ శాఖ రంగంలోకి దిగింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాల డీపీవోలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అవసరమైన ఎన్నికల నిర్వహణ చర్యలపై వివరాలు సేకరించాల్సిందిగా స్పష్టం చేశారు.

Telangana Local Body Elections తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏం సూచనలు ఇచ్చారు అధికారులు.?
ఈ మేరకు మండలాలు, గ్రామాల వారీగా సామగ్రి నిల్వలు, పనితీరు వంటి అంశాలపై తక్షణ తనిఖీలు చేసి నివేదిక పంపించాలని సూచించారు. కొత్త సామగ్రి అవసరమైతే వెంటనే ఇండెంట్ పంపించాలని అధికారులకు తెలియజేశారు.
ఈ నిర్ణయాల వల్ల స్థానిక ఎన్నికల నిర్వహణ మరింత గణనీయంగా, సమర్థవంతంగా జరిగే అవకాశముంది. ఇదే సమయంలో అధికారులు ప్రజల సహకారం కూడా కోరుతున్నారు. ముందస్తు ఏర్పాట్లు, సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే చర్యా షెడ్యూల్ విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu