Telanganapatrika (జూలై 12): Telangana GPO Notification 2025, ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది.

Telangana GPO Notification 2025:
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ గ్రామ పాలనాధికారి (జీపీవో)ను, ప్రతి మండలానికి భూవిస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించి తుది పరీక్షను జూలై 27న, ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలను జూలై 28 మరియు 29 తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఫలితాలు ఆగస్టు 12న విడుదలవుతాయి. అనంతరం 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది.
భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో మ్యాప్ తప్పనిసరి కావడంతో 10,000 మందికి శిక్షణ ప్రారంభమైంది. మొదటి విడతలో 7,000 మందికి శిక్షణ పూర్తికావచ్చింది. మిగతా 3,000 మందికి ఆగస్టు రెండవ వారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇక జీపీవో నియామకానికి సంబంధించి, పూర్వ విఆర్వో, విఆర్సుల కోసం ప్రత్యేక అర్హత పరీక్షను నిర్వహించగా, ఇప్పటివరకు 3,554 మందిని ఎంపిక చేశారు. విన్నపాల మేరకు మరోసారి జూలై 27న పరీక్ష నిర్వహించనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నక్షా లేని గ్రామాలకు ప్రాధాన్యత లేకుండా వదిలేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు పీల్ట్‌గా ఐదు గ్రామాల్లో రీసర్వే విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 2,988 ఎకరాల్లో వివాదాల్లేకుండా సర్వే పూర్తయింది. దీని ఫలితంగా భూమి సమాచారం స్పష్టంగా ఉండి రైతులకు పారదర్శక సేవలు అందుతాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇందువల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే కోసం చర్యలు చేపట్టనున్నట్లు అధికారుల సమీక్షలో వెల్లడయ్యింది
వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!