Telanganapatrika (జూలై 18) : SSC CHSL 2025 Application Last Date Today. 2025 సంవత్సరానికి సంబంధించి SSC CHSL పరీక్షకు దరఖాస్తు చేసేందుకు చివరి రోజు ఇదే. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ C ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జూలై 18 (ఈరోజు) అప్లికేషన్ చివరి తేదీగా SSC ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలలోని గ్రూప్ C పోస్టులు భర్తీ చేయనున్నారు.

SSC CHSL 2025 Application Last Date Today.
ముఖ్య తేదీలు:
- దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 18, 2025
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూలై 19, 2025
- ఫారం సవరణ తేదీలు: జూలై 23–24, 2025
ఖాళీలు & పోస్టులు:
ఈ డ్రైవ్ ద్వారా మొత్తం 3,131 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో:
- Lower Division Clerk (LDC)
- Postal Assistant (PA)/Sorting Assistant (SA)
- Data Entry Operator (DEO)
ఇతర గ్రూప్ C పోస్టులు ఉన్నాయి.
SSC CHSL 2025 Application Last Date Today అర్హతలు:
- DEO/DEO Grade A పోస్టులకు: మ్యాథ్స్‌తో పాటు సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- LDC, JSA & DEO ఇతర పోస్టులకు: 12వ తరగతి ఉత్తీర్ణత మాత్రమే సరిపోతుంది.
పరీక్ష వివరాలు:
- టియర్ 1 (CBT): సెప్టెంబర్ 8 – 18, 2025 మధ్య జరుగుతుంది.
- టియర్ 2 (డిస్క్రిప్టివ్ పేపర్): ఫిబ్రవరి – మార్చి 2026 మధ్యలో నిర్వహించనున్నారు.
ముఖ్య సూచన:
ఇప్పటికీ దరఖాస్తు చేయని అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే అప్లికేషన్ పూర్తి చేయాలి. చివరి నిమిషానికి దరఖాస్తు వాయిదా వేసుకుంటే సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
Apply link: https://ssc.gov.in