Sonu Sood helps Fish Venkat , సినిమా రంగంలోనే కాకుండా మానవత్వంలోనూ హీరోగా నిలుస్తున్న సోనూసూద్, మరోసారి తన గొప్ప మనసును చూపించారు. ఇటీవల మరణించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించి, తమ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Sonu Sood helps Fish Venkat స్నేహానికి నిలువెత్తు నిదర్శనం..
వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం, తన తండ్రి దశదిన కర్మ కార్యక్రమానికి కావలసిన రూ.1.5 లక్షలు సోనూసూద్ అందజేశారని, అదే వల్లే గ్రాండ్‌గా కార్యక్రమం నిర్వహించగలిగామని తెలిపారు.
అంతేకాదు, వెంకట్ ఇంటి నిర్మాణ బాధ్యతను తానే చూసుకుంటానని సోనూ చెప్పారని ఆమె చెప్పింది. వెంకట్ తనకు సోదరుడి లాంటివాడని భావించి ఆ కుటుంబానికి తన పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చినట్టు సమాచారం.
ఈ మానవతా కర్తవ్యాన్ని చూసి అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు సోనూకి అభినందనలు తెలుపుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu